మిస్టర్ పెర్ఫెక్ట్ కాపీనే అని తేల్చేసిన కోర్ట్  

jio rockers 2019 telugu cinemalu

మిస్టర్ పెర్ఫెక్ట్ కాపీనే అని తేల్చేసిన కోర్ట్  

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలలో ఒకటిగా, తనని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న చిత్రం మిస్టర్ పెర్ఫెక్ట్. ఈ సినిమాలో మొదటి సారి ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో పాటు, ఫ్యామిలీ హీరోగా మెప్పించాడు.

కుటుంబ బంధాలు, ఇండిపెండెంట్ ఆలోచనల మధ్య ఉన్న చిన్న వ్యత్యాసంని ఈ సినిమాలో దర్శకుడు దశరధ్ ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక దిల్ రాజు బ్యానర్ తెరకెక్కిన ఈ సినిమాపై శ్యామలా రాణి అనే రచయిత తన నవల కాపీ చేసి సినిమా తీసారని రెండేళ్ళ క్రితం కోర్ట్ కి వెళ్ళింది.

అయితే ఈ సినిమా కాపీ కథ కాదని తాను 2009లోనే కథని సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించుకున్న అని, ఇక ఆమె నవల 2010 వచ్చింది అని గతంలోనే దర్శకుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అయితే ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు కూడా వెనక్కి తగ్గకపోవడం ఆమె కోర్ట్ లోనే తేల్చుకునేందుకు సిద్ధం అయ్యింది. దీనిపై రెండేళ్ళుగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ లో కేసు విచారణ నడుస్తుంది.

తాజాగా ఈ కేసుపై కోర్ట్ తీర్పు చెప్పింది. మిస్టర్ పెర్ఫెక్ట్ మూవీ, శ్యామల రాణి నా మనసు నిన్ను కోరే నవల ఒకేలా ఉన్నాయని నిర్ధారించిన కోర్ట్, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని రచయితకి న్యాయం చేయాలని పోలీసులకి ఆదేశించింది.