చిరు- కొరటాల సినిమాలో అవకాశం పట్టేసిన హాట్ యాంకర్!  

jio rockers 2019 telugu cinemalu

చిరు- కొరటాల సినిమాలో అవకాశం పట్టేసిన హాట్ యాంకర్!  

సైరా మూవీ షూటింగ్ ఫినిష్ అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో మరో భారీ చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటి వరకు చేసిన కమర్షియల్ మెసేజ్ చిత్రాల తరహాలోనే ఈ సారి కూడా చిరంజీవితో అదిరిపోయే సోషల్ ఎలిమెంట్స్ తో సినిమాని సెట్స్ పైకి శివ తీసుకెళ్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటీనటుల ఎంపిక చేసే పనిలో దర్శకుడు ఉన్నాడు.

ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కీలక పాత్రలలో కనిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఖైదిలో మిస్ చేసుకున్న అవకాశం సునీల్ ఈ సినిమాలో సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే రంగస్థలం సినిమాలో రంగంమత్త పాత్రలో అందరికి భాగా కనెక్ట్ అయిపోయిన హాట్ యాంకర్ అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తుంది., తాజాగా ఆమెని సినిమా కోసం కొరటాల ఫైనల్ చేసాడని టాక్ వినిపిస్తుంది.