ఆ దర్శకుడికి దిల్‌ రాజు సోపేస్తున్నాడా?  

ఆ దర్శకుడికి దిల్‌ రాజు సోపేస్తున్నాడా?  

హిట్‌ ఇచ్చిన దర్శకులను వెంటనే తన బుట్టలో పడేసుకోవడంలో నిర్మాత దిల్‌రాజు ముందు ఉంటాడు. ప్రతి ఒక్క దర్శకుడిని తనకు టచ్‌లో ఉండేలా చేసుకోవడంలో దిల్‌రాజు తర్వాతే మరెవ్వరు అయినా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా జెర్సీ చిత్రంతో ఒక మంచి ఫీల్‌ గుడ్‌ మూవీని అందించిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి, ఈయన తీసిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను దక్కించుకున్న నేపథ్యంలో దిల్‌రాజు ఆయనకు సోపు వేసే పనిలో పడ్డట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన జెర్సీ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నాని హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో దర్శకుడిపై విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నిర్మాత దిల్‌రాజు ఆ చిత్ర దర్శకుడు గౌతమ్‌ను మెల్లగా తన వైపుకు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులందరిని అభినందించేందుకు భారీగా ఖర్చు చేసి మరీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

తనకు సంబంధం లేని సినిమాకు ఇలా వేడుక చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. దిల్‌రాజు ఈ చిత్రంకు ఫిదా అయ్యాడు.

అందుకే చిత్ర యూనిట్‌ సభ్యులందరిని పిలిచి మరీ అందరికి సన్మానం చేయడంతో పాటు, అందరిని ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ నేపథ్యంలో అతడు దర్శకుడు గౌతమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఇదే సమయంలో తమ బ్యానర్‌లో సినిమా చేసేందుకు మంచి కథను సిద్దం చేయాలని కూడా కోరడం జరిగింది. ఇంతగా కోరిన తర్వాత ఏ దర్శకుడు మాత్రం కాదనగలడు చెప్పండి.

అందుకే తప్పకుండా దిల్‌రాజు బ్యానర్‌లో తప్పకుండా గౌతమ్‌ మూవీ ఉంటుందనిపిస్తుంది.